కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా 'సామాన్యుడు'. ఈ విడుదలకు ముస్తాబవుతోంది. 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనేది ఈ సినిమా క్యాప్షన్. కొత్త దర్శకుడు తు.పా.శరవణన్ తెరకెక్కించిన ఈ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ అయిన 'విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' (VFF) పై నిర్మిస్తున్నాడు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు చిత్రబృందం వారు.సినిమా ట్రైలర్ ను బట్టి విశాల్‌ ఈ సినిమాలో ఓ కామన్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు.ఎప్పటిలాగానే అతను ఫిట్ గా ఇంకా ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇది క్రైమ్ కథనే అనే సంకేతాలు కూడా ఈ ట్రైలర్ లో ఇచ్చారు. భీభత్సమైన యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ తో కూడా నిండి ఉంది ఈ ట్రైలర్. డింపుల్ హయాతి విశాల్ కు జంటగా ఈ సినిమాలో కనిపిస్తుంది.వీళ్ళ పెయిర్ కూడా చాలా బాగుంది.

ఇక డైలాగులు కూడా చాలా బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. టెక్నికల్ గా చూసుకుంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే భరోసా ఇస్తుంది తాజాగా విడుదల అయిన ట్రైలర్.కవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ ఇంకా విశాల్ ఆస్థాన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించిన నేపధ్య సంగీతం కూడా హైలెట్స్ అని చెప్పొచ్చు.ఈ సినిమా నటీ నటుల విషయానికి వస్తే.. ఇందులో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ తులసి ఇంకా అలాగే రవీనా రవి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక తెలుగులో 'అభిమన్యుడు' సినిమా తర్వాత విశాల్ నుండీ వచ్చిన సినిమాలు పెద్దగా హిట్టయ్యి అంతగా ఆడలేదు. 'పందెం కోడి2' సినిమా కొంచెం పర్వాలేదు అనిపించినా కాని 'అయోగ్య' 'చక్ర' 'ఎనిమి' 'యాక్షన్' వంటి సినిమాలు అయితే ప్లాప్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక 'సామాన్యుడు' సినిమా ట్రైలర్ బాగుంది కాబట్టి విశాల్ మళ్ళీ తెలుగులో హిట్టు కొట్టి మునుపటిలో బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: