ఇటీవలి కాలంలో హాలీవుడ్ సినిమాల  హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథాంశంతో సినిమాలను తెరకెక్కిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు ఎంతోమంది.
 అటు హాలీవుడ్ లో కూడా  అద్భుతమైన కథాంశంతో  తెరకెక్కుతు అన్ని భాషల ప్రేక్షకులను కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి ఎన్నో సినిమాలు. అలాంటి వాటిలో మిషన్ ఇంపాజిబుల్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. యాక్షన్ స్పై త్రిల్లర్ కథాంశంతో   తెరకెక్కిన ఈ సినిమా  ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షించింది. ఇక ఈ సినిమా  లోని యాక్షన్ సన్నివేశాల గురించి అయితే ఎంత చెప్పిన తక్కువే. వరుసగా ట్విస్టులతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాకు వరుసగా సీక్వెల్స్  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే  ఆరు సీక్వల్ లు కూడా ప్రేక్షకుల ఆదరణ పొంది సూపర్ హిట్ అయ్యాయి. ఇక మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు  క్రిస్టోఫర్ దర్శకత్వం వహిస్తూ ఉండటం గమనార్హం.


 ఇకపోతే ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్  ఏడవ సీక్వెల్ తెరకెక్కుతూ ఉండగా దీనిపై ప్రేక్షకులు అందరిలో ఎంతగానో ఆతృత పెరిగిపోయింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఇక ఈ మిషన్ ఇంపాజిబుల్ 7 విడుదల తేదీ మాత్రం వాయిదా పడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2022 సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించారు. కాని ఆ తర్వాత ఇక ఈ సినిమా విడుదల కాస్త పడినట్లు తెలుస్తోంది. 2023, జూలై 14వ తేదీకి వాయిదా పడటంతో ప్రేక్షకులందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు.



 ఇక పోతే ఇక ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ 8 రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. మిషన్ ఇంపాజిబుల్ 7.. 2023కి వాయిదా పడటంతో.. ఇక ప్రస్తుతం  ఇక 8వ సీక్వెల్  కూడా విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 28, 2024 కు మిషన్ ఇంపాజిబుల్ 8 సీక్వెల్ వాయిదా పడింది. దీంతో ఇక యాక్షన్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ మరింత నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: