టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు. కానీ విడాకుల తర్వాత మాత్రం సమంత ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవడానికి అటు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సమంత మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక తన సినిమా అప్డేట్ లతో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను కూడా సమంత సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.



 ఇటీవలి కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంతా కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు విహార యాత్రలకు వెళుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఎన్నో సాహస యాత్రలు చేస్తూ ఎన్నో అనుభవాలను సంపాదిస్తుంది సమంత. ఇక ప్రస్తుతం సమంత స్విజర్లాండ్ టూర్ లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే స్కియింగ్  చేస్తూ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ తెలుపుతూ ఒక వీడియో ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోకి సమంతా జత చేసిన కామెంట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గతంలో నేను ఎప్పుడూ స్కీయింగ్ ట్రై చేయలేదు స్కియింగ్ అంటే ఎంతో సాహసోపేతమైనది. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి సాహసోపేతమైన టాస్క్ ఎంతో విజయవంతంగా పూర్తిచేసి ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి ట్రైనర్ కేట్, టోనేస్క్  కారణం అంటూ సమంత వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక కామెంట్ చేసింది.



 ఇకపోతే సమంత ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో మాత్రం వైరల్ గా మారిపోయింది. ఇక స్కియింగ్ చేస్తూ ఉండటాన్ని చూసి వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంతో మంది నెటిజన్లు. ఇక ఈ వీడియో పై స్పందించిన సమంతా స్నేహితురాలు చిన్మాయ్  కమాన్ సామ్ ఏదైనా స్కియింగ్ పోటీలో పాల్గొని స్వర్ణపతకం సాధించి రా అంటూ కామెంట్ పెట్టింది. ఇకపోతే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది సమంత. అదే సమయంలో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కూడా చేస్తోంది. మరోవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: