గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు అని చెప్పాలి. చాలామంది ఆ సినిమాలో వచ్చే  డైలాగులను మేనరిజమ్స్ ను వాడుతూ సినిమా యొక్క క్రేజ్ను స్థాయిని పెంచుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించి అదే స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరు చూపిస్తూ ఈ సినిమా విజయం తో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది.

తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. ఆ విధంగా హిందీలో 100 కోట్లకు మించి వసూలు రాబట్టి అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ సినిమా సాధించిన విజయం తో దక్షిణాది సినిమాలకు సరికొత్త ఊపు వచ్చింది అని చెప్పవచ్చు.  ఈ సినిమాకు 332 కోట్లకు మించి వసూళ్లు వచ్చాయి అంటే ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరిన్ని సినిమాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు మొదటి భాగం పూర్తయిన నేపథ్యంలో రెండవ భాగం పైనే అందరి చూపు ఉంది.

సినిమా త్వరలోనే సెట్స్ పైకి తీసుకు రాబోతుండగా తప్పకుండా మొదటి భాగానికి మించిన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. తాజాగా ఓ సరికొత్త చర్చ బాలీవుడ్ లో జరుగుతుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా కేజీఎఫ్ రెండవ భాగం క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాస్తుందనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ప్రచారం లేకుండానే పుష్ప మొదటి భాగం ఈ స్థాయి లో వసూళ్లు రాబట్టింది. ఒకవేళ గట్టిగా ప్రచారం చేస్తే తప్పకుండా కే జి ఎఫ్ సినిమా రికార్డులను అధిగమించడం ఖాయం అంటున్నారు. మరి రెండవ భాగానికి సంబంధించిన సినిమా ప్రమోషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: