ప్రస్తుత కాలంలో సౌత్ ఇండియన్ సినిమా నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తూ ఉన్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెద్ద హీరోల నుంచి వస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తున్నాయి. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు అంటే దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చిన్నచూపు ఉండేది. చాలామంది ఈ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు కానీ ఇటీవల కాలంలో ఎక్కడా చూసినా కూడా సౌత్ ఇండియన్ సినిమానే వినబడుతుంది. ఆ సినిమాలు చూడటానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

బాహుబలి సినిమా సౌత్ ఇండియన్ సినిమా యొక్క స్థాయిని పెంచింది అని చెప్పవచ్చు. దేశంలో సౌత్ ఇండియన్ సినిమాల యొక్క స్థాయిని ఈ విధంగా ఉంటుందని చాటిచెప్పిన సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ తరహాలోనే దక్షిణాది సినిమాలు  దేశంలోని చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో విడుదల కాగా అది సాధించిన విజయం బాలీవుడ్ ను విస్మయం చెందేలా ఉంది.. ఆ విధంగా సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేసే విధంగా అక్కడి హీరోలు సిద్ధమవుతున్నారు.

ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సౌత్ ఇండియన్ సినిమా యొక్క స్థాయిని మరింతగా పెంచింది అని చెప్పవచ్చు. ఇప్పటికే బాహుబలితో తన సత్తా చాటిన రాజమౌళి ఈ సినిమాతో మరొక విజయాన్ని అందుకొని మరొకసారి తన స్టామిన నిరూపించాడు.  ప్రపంచమంతటా తెలిసేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన సౌత్ ఇండియన్ సినిమా సాయిని భారీ స్థాయిలో పెంచింది. ఆ విధంగా కే జి ఎఫ్ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించి ఉత్తరాదివారు మొత్తం దక్షిణాది వైపు చూసే విధంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాబోయే మరిన్ని దక్షిణాది సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో అని ఆతృతగా ఎదురుచూస్తుంది ప్రపంచం మొత్తం. 


మరింత సమాచారం తెలుసుకోండి: