ఇప్పుడు చాలా మంది హీరోలు త్వరగా పూర్తయ్యే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోలా భారీ బడ్జెట్ భారీ సమయాన్ని తీసుకునే సినిమాలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏదైనా కూడా ఈ విధంగా పెద్ద హీరోలు చిన్న హీరోలు తమ అభిమానులను అలరించే విధంగా సినిమాలను చేస్తూ అందరినీ ఎంతగానో అలాగే అలరిస్తున్నారు. ఆ విధంగా టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు శివ నిర్వాన తో కలిసి చేస్తున్న సినిమా ను అతి తక్కువ కాలంలోనే చేయాలని భావిస్తున్నారు.

ప్రేమ కథ సినిమాలను ఎంతో బాగా తెరకెక్కించే దర్శకుడు అయిన శివ నిర్వాన తో కలిసి ఇటీవలే ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలని విజయ్ దేవరకొండ దర్శకనిర్మాతలకు సూచించగా పూజా కార్యక్రమాలు జరిగిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది కాశ్మీర్ లో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. అద్భుతమైన ప్రేమ కథ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తోంది.

 చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఘనంగా నిర్మిస్తున్న ఈ సినిమా కేవలం రెండు నెలల సమయంలో పూర్తి కాబోతుందట. కశ్మీర్లో నెల రోజుల షెడ్యూల్ లో ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు. హైదరాబాదు మరియు వైజాగ్ ప్రాంతాల్లో ఈ సినిమా యొక్క మిగిలిన బాధ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఆ విధంగా ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాను డిసెంబర్ లో అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోయే జనగణమన సినిమా వచ్చే ఏడాది మొదటి అర్ధ భాగంలో విడుదల చేయాలని విజయ్ ప్లాన్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: