లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. విశ్వరూపం సినిమా తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో కమల్ హాసన్ అభిమానులు ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా... ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజు కూడా ఇది వరకు దర్శకత్వం వహించిన మానగరం, ఖైదీ, మాస్టర్ మూవీ లు మంచి విజయలను సాధించడంతో విక్రమ్ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అయ్యింది. అసలు విషయం లోకి వెళితే...  విక్రమ్ సినిమా విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకున్నాడు అనే ప్రచారం జరిగింది.  

కమల్ హాసన్ కు దర్శకుడిగా ఉన్న అనుభవం వల్ల విక్రమ్ సినిమా విషయంలో జోక్యం చేసుకున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ విషయంపై విక్రమ్ మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజు స్పందిస్తూ... విక్రమ్ మూవీ విషయంలో కమల్ హాసన్ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు అని , ఒక నటుడిగా ఆయన విక్రమ్ సినిమా విషయంలో పూర్తిగా సహకరించారు అని, దర్శకుడిగా కమల్ హాసన్ కు ఉన్న అనుభవం వల్ల విక్రమ్ సినిమా విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు అని తాజాగా లోకేష్ కనకరాజు వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: