వర్షం ఫేమ్ డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తను నేను, పేపర్ బోయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను కరోనా లాక్ డౌన్ టైం లో ఏక్ మిని కథ అంటూ ఓ మూవీతో హిట్ కొట్టాడు. సినిమా రిలీజైంది ఓటీటీలోనే అయినా సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఆ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమా చేశాడు యువ హీరో. ప్రస్తుతం అతని చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

వీటితో పాటుగా మరో కొత్త ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉంది. ఏక్ మిని కథ సినిమాకు స్టోరీ అందించిన మేర్లపాక గాంధి డైరక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాని కూడా యువి కాన్సెప్ట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. సినిమాకు వెరైటీ టైటిల్ ని అనుకున్నారట చిత్రయూనిట్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా.. లైక్ షేర్ సబ్ స్క్రైబ్. ఇదేదో యూట్యూబ్ ఛానెల్ లో చివరి వచ్చే కామెంట్ లా ఉంది కదా.. అవునండి అదే సినిమా టైటిల్. సినిమాలో హీరో ఒక యూట్యూబర్ గా కనిపిస్తాడట.

ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్స్ చేస్తున్న వింతలన్ని ఈ సినిమాలో ఉంటాయని. కామెడీతో పాటుగా వాటికి పంచ్ వేసే లా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా టైటిలే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అని కొత్తగా అనిపించేలా ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. సంతోష్ శోభన్ ప్రస్తుతం ప్రేమ్ కుమార్, అన్ని మంచి శకునములే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. మంచి సినిమాల లైనప్ తో వస్తున్న సంతోష్ శోభన్ తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా చేస్తాడని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: