యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు.

ఇలా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో  ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కూడా భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్న ట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.  కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోయే తాజా సినిమా ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా 30 వ సినిమా. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను కొరటాల శివ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే కొరటాల శివ ఈ కథలో హీరో క్యారెక్టరైజేషన్  చాలా స్టైలిష్ గా రాసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆ క్యారెక్టర్ కు బలమైన సన్నివేశాలు ఉండే విధంగా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి  ప్రారంభం కాబోతున్న తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పేరు ను మాత్రం చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: