పవన్ కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ తాజాగా ఓ సినిమా వేదిక లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయన పవన్ తో చేయబోయే సినిమా గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మరోక మూవీ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయిక సినిమా రావాలని అభిమానులు ఎంతో కోరుకున్నారు. ఆరోజుల్లో గబ్బర్ సింగ్ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.

అలాంటి మ్యాజిక్ హిట్ మరోసారి కొట్టాలని తప్పకుండా ఈ కాంబో లో సినిమా వస్తే అలాంటి విజయం వస్తుందని భావించారు కానీ ఇద్దరు వేరు వేరు ప్రాజెక్ట్ లు చేయడం వల్ల అది కుదరలేదు. ప్రస్తుతం  వీరి కలయికలో ''భవదీయుడు భగత్ సింగ్'' అనే చిత్రాన్ని ప్రకటించారు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క లుక్స్ విడుదల కాగా అవి సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో అందరు ఈ సినిమా పై నెగెటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు.

అసలు ఈ సినిమా ఉంటుందా అన్న అనుమానాలను వ్యక్తపరిచారు. అయితే వాటన్నిటికీ సమాధానం ఇస్తూ హరీష్ శంకర్సినిమా ఖచ్చితంగా ఉంది అని కుండబద్ధలు కొట్టేశారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో అయన ఈ విషయాన్నీ వెల్లడించారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో డైలాగ్స్ చాలాబాగున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ లెవెల్ లో తెరకెక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: