ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కేజిఎఫ్ రెండు భాగాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత ఇప్పుడు సలార్ చిత్రాన్ని చేస్తున్న ప్రశాంత్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పైనే పూర్తి దృష్టి సారించారు. త్వరలోనే ఈ సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఈ ఏడాదిలో సినిమా ను పూర్తి చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నాడు.

ఎన్టీఆర్ నటించిన గత సినిమా ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన చేయబోయే తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి భారీ క్రేజ్ భారీ చిత్రాలు చేసే దర్శకుడు ఎంచుకుంటూ పోతున్నాడు ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా ఆయనకు ఏ స్థాయిలో విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విజయోత్సాహంతో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ సినిమా జూలై నుంచి మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో కొరటాల శివ ఆచార్య సినిమా ప్రభావం నుంచి కోలుకోవడానికి ఈ సినిమాను తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఏర్పడింది. మరి ఎంతో నమ్మకం పెట్టుకున్న ఎన్టీఆర్ ఆశలను ఈ దర్శకుడు నెరవేరుస్తాడా అనేది చూడాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఈ సినిమా కూడా అంతకుమించి విజయాన్ని సాధించాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి మంచి కథగా అందరు చెప్పుకుంటున్న ఈ సినిమా కథనం, ఎలివేషన్ పరంగా బాగా వర్క్ అవుట్ అవ్వాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: