ప్రతి సంవత్సరం థియేటర్ లలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలలో మాత్రం ఒకే సారి వరుస పెట్టి అనేక సినిమాలు విడుదలవుతుంటాయి. అలా అనేక సినిమాలు ఒకటి రెండు రోజుల గ్యాప్ తో విడుదల కావడం వల్ల బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కాస్త తక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాస్త నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు తీవ్రమైన తక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందు వల్లనే హీరోలు, దర్శకనిర్మాతలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సినిమాలను ఒకటి , రెండు వారాల గ్యాప్ తో విడుదల చేస్తూ ఉంటారు. అలా విడుదల చేయడం ద్వారా సినిమా కలెక్షన్ల పై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది.  కాకపోతే ఈ ఆగస్టు నెలలో మాత్రం రెండు మూడు రోజుల్లో దాదాపు అరడజను సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో చాలా వరకు సినిమాలు మంచి అంచనాలు ఉన్న సినిమాలే కావడం విశేషం. మరి ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

లాల్ సింగ్ చద్ద : అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లాల్ సింగ్ చద్ద  మూవీ లో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా,  ఈ మూవీ లో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది.


కోబ్రా : ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది.


ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఆగస్టు 12 వ తేదిన విడుదల కాబోతుంది.


మాచర్ల నియోజకవర్గం : నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది.


యశోద : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమా ఆగస్టు 12 వ తేదిన విడుదల కాబోతుంది.


స్వాతిముత్యం : ఈ సినిమా ఆగస్టు 13 వ తేదీన విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: