టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ప్రముఖ స్టార్ హీరో బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తాజాగా అఖండ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఆయన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఈయన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఇక  అందర్నీ ఆకర్షించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా బాలయ్య సినిమా సెట్లో సందడి చేసింది శృతిహాసన్. శృతిహాసన్ టాలెంట్ కి ఫిదా అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా మోస్ట్ టాలెంటెడ్ అంటూ ట్వీట్ కూడా చేయడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

నట విశ్వ సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ ఆయన వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది శృతిహాసన్.  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇక ఒకవైపు కోలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతూ మరెంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక గత కొంత కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరం గా ఉన్న శ్రుతి హాసన్ ఇటీవల రవితేజ సరసన క్రాక్ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం బాలయ్య , చిరంజీవి,  ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా బాలయ్య బాబు నటిస్తున్న #NBK 107 వర్కింగ్ టైటిల్ తో  రూపొందుతున్న సినిమా షూటింగ్ నెట్ లో పాల్గొని సందడి చేసింది. ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన ట్విట్టర్  ఖాతా ద్వారా తెలియజేస్తూ మోస్ట్ టాలెంటెడ్ అలాగే నా ఫేవరేట్  శృతి హాసన్ సెట్ లో ఉంది అంటూ ఆమెతో కలిసి దిగిన ఒక ఫోటోను ఆయన ద్వారా షేర్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: