తాజాగా  సూపర్ స్టార్ మహేష్ బాబు  హీరోగా  మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  దర్శకత్వంలో ఓ భారీ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది సంగతి తెలిసిందే.ఇకపోతే ఇది మహేశ్ కెరీర్‌లో చేస్తున్న 28వ సినిమా. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలావుంటే మహేష్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే  నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే  ఇటీవలే దర్శకుడు త్రవిక్రమ్, మహేష్‌కు ఫైనల్ నరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా కథ మొత్తం విన్న మహేష్ బాబు ఓకే చేయడంతో, రెగ్యులర్ షూటింగ్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీ అయిపోయారు.

ఇకపోతే  తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన, సర్ప్రైజింగ్ అప్ డేట్ అంటూ ఓ వార్త బయటికి వచ్చింది.అయితే ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఇక ఇప్పటివరకూ మహేష్‌ చేసిన సినిమాల్లో డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు.అయితే  మాములుగా తెరపై ఒక మహేశ్ బాబు కనిపిస్తే ఫాన్స్ ని ఆపడం కష్టం.పోతే  అలాంటిది ఇద్దరు మహేశ్ బాబులు ఒకేసారి తెరపై కనిపిస్తే, ఆ రేంజ్ మరో లెవల్.అంతేకాక సెకండ్ హాఫ్‌లో వచ్చే మహేష్ పాత్ర సినిమాకు మేయిన్ హైలైట్‌గా నిలుస్తుందని, ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని సమాచారం.

అయితే  ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 'అరవింద సమేత' తరహలోనే, ఓ భారీ ఫైట్ తో ప్రారంభించబోతున్నారని... దీనికి రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తుంచనున్నట్టు సమాచారం అందుతోంది.ఇకపోతే ఈ ఫైట్ కోసం మాస్టర్స్, ఇప్పడకే భారీ స్కెచ్ కూడా సిద్దం చేశారట.కాగా  రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అరవింద సమేత సినిమా ఓపెనింగ్ కోసం కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్, ఎన్టీఆర్ ని ఒక రేంజులో ఎలివేట్ చేసింది. ఇక టాలివుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ లో అరవింద సమేత ఒకటి.అయితే  ఇదే రేంజులో మహేష్‌తో చేస్తున్న సినిమాలో, హీరో ఇంట్రడక్షన్ ఉండేలా త్రివిక్రమ్, రామ్ లక్ష్మణ్ ప్లాన్ చేస్తున్నారట.పోతే  ఇదే జరిగితే నెవర్ బిఫోర్ మాస్ హీరోగా మహేష్‌ని చూడబోతున్నాం.. అని నమ్మకంగా చెప్పొచ్చు.ఇదిలావుంటే  థమన్  ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: