ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన సినిమా హ్యాపీ బర్త్ డే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు ఎన్నో అంచనాలతో వచ్చింది. మాములుగా లావణ్య త్రిపాఠి చాలా మంది హీరోయిన్ లలాగే అంతగా సక్సెస్ కాలేదు. తన సక్సెస్ కేవలం రెండు మూడు సినిమాలకే పరిమితం అయింది. అయితే కొంత గ్యాప్ తీసుకుని కొత్త కాన్సెప్ట్ తో, కొత్త డైరెక్టర్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది లావణ్య. ఈ సినిమాకు మత్తు వదలరా సినిమాను అద్భుతంగా తెరకెక్కించి హిట్ కొట్టిన రితేష్ రాణా, దీనికి డైరెక్షన్ చేశాడు. ఉదయం నుండి సోషల్ మీడియా చానెళ్లు మరియు ఆన్లైన్ వెబ్ సైట్స్ దీని గురించి రకరకాల రివ్యూస్ ఇచ్చాయి. మరి ఈ రివ్యూలను అనుగుణంగా చేసుకుని ఇంతకీ లావణ్య త్రిపాఠి బర్త్డే ఎలా జరిగింది తెలుసుకుందాం.

కథ కొత్తగా ఉంది... స్టార్ట్ చేసిన విధానం గమ్మత్తుగా ఉంది. పాత్రల పరిచయం ఇంకా బాగుంది. మొదటి అరగంట సినిమాలో ప్రెకషకులు లీనం అవుతారు. అయితే ఆ తరువాత నుండి దాదాపుగా క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు రితేష్. కథ ఇది అని చెప్పడానికి లేకుండా ఇష్టం వచ్చినట్లు నడిపిస్తూ వెళ్ళాడు డైరెక్టర్. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య మరియు లావణ్యలు లేకుంటే కనుక దారుణంగా ఉండేది పరిస్థితి. లావణ్య మాత్రం లైఫ్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తానికి సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఖచ్చితంగా అసహనంగా వెళ్ళాడు. డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి.

మత్తువదలరా సినిమా తర్వాత ఈ రేంజ్ సినిమాను అతని నుండి ఊహించలేదు అన్నది కొందరి అభిప్రాయం. ఎడిటింగ్ , స్క్రీన్ ప్లే, రన్ టైం ఎక్కువ కావడం , ఎబ్బెట్టుగా ఉండే కామెడీ సినిమా స్థాయిని పడిపోయేలా చేశాయి. సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడడంతో ప్రమోషన్స్ ను చాలా బాగా చేశారు. అయినా లావణ్య త్రిపాఠి బర్త్ డే అసంపూర్తిగా లాస్ట్ లో బిరియాని లేకుండా జరిగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: