బాలీవుడ్ లో బిగ్ బాస్ కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 15 ఏళ్లుగా బాలీవుడ్ లో బిగ్ బాస్ విజయంగానే కొనసాగుతూ ఉన్నది. అ షో నిర్వహకులు ఈ షో సక్సెస్ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. ఇక వీటితోపాటుగా తమిళంలో తెలుగులో బిగ్ బాస్ షో కూడా ప్రారంభం అవ్వడానికి కారణం అయ్యింది. ప్రతి ఏడాది కూడా బిగ్ బాస్ అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నది.


ఇక కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా బాగానే సక్సెస్ అయ్యింది ఇప్పటికే కొన్ని సీజన్లు సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. బాలీవుడ్ లో రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఏడాది బిగ్ బాస్ ద్వారా కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతున్నదట. బాలీవుడ్ లో టీవీ చానల్స్ రేటింగ్ మెరుగు పడటానికి ముఖ్య కారణం బిగ్ బాస్ అనే చెప్పవచ్చు. అయితే తాజాగా బాలీవుడ్ లో సీజన్ -16 కు సంబంధించిన వాటికి సిద్ధంగా అవుతోంది ఈ సీజన్ హోస్టు బాధ్యతలు కూడా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కే అప్పగించినట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు అత్యధిక సీజన్లు హోస్టుగా వ్యవహరించిన నటుడుగా పేరు పొందాడు సల్మాన్ ఖాన్. ఇక ఈ నటుడు ఈ షో చేశారంటే చాలు సక్సెస్ అవుతుందని సెంటిమెంట్ అక్కడ ఉన్నది. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు గత సీజన్  చూసుకుంటే సల్మాన్ ఖాన్ రూ.350 కోట్ల రూపాయల కొరకు సంపాదించారు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్-16 కి రూ. 1000  కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ తో సహా ఇతర ఉత్తరాది భాషలలో కూడా బిగ్ బాస్ క్రేజ్ బాగానే ఉన్నది. మరి సల్మాన్ ఖాన్ నిజంగానే ఇంతటి రెమ్యురేషన్ అందుకోబోతున్నాడ అనే విషయం సందేహంగానే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: