రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తో ప్రదర్శితమవుతోందట.. సినిమాలో రామ్, ఆది పినిశెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయట.


కృతిశెట్టి నటన మాత్రం ప్రేక్షకులు ఆశించిన విధంగా లేదని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ ను రామ్ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. టాక్ నెగిటివ్ గా ఉన్నా ఈ సినిమాకు కలెక్షన్లు అయితే బాగా వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడానికి రామ్ ప్రయత్నిస్తుండటం విశేషం.బీ, సీ సెంటర్లలో ది వారియర్ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి మరి.. తొలిరోజు ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా క్రిటిక్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చినా థియేట్రికల్ కలెక్షన్లు మాత్రం ఊహించ ని స్థాయిలో వచ్చాయి. మాస్ యాక్షన్ కథాంశాలు రామ్ కు కూడా ప్లస్ అవుతాయ ని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.


 


అయితే అదే సమయంలో కథలో కొత్తదనం ఉండేలా రామ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కొత్తదనం ఉన్న కథల ను ఎంపిక చేసుకోవడం లో రామ్ ఫెయిలవుతున్నాడని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రామ్సినిమా తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటించడాని కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


 


ది వారియర్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రం రామ్ కు ఒక విధంగా స్టార్ హీరో ఇమేజ్ వచ్చినట్టేనని చెప్పవచ్చు. రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి మరి.సినిమాసినిమాకు రామ్ కు క్రేజ్ పెరుగుతుండగా రామ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: