టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అక్కినేని హీరోలకు ప్రత్యేక స్థానం ఉంది. వారి చిత్రాలకు కోట్లాది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకొని సినిమాలను చేస్తూ ఎంతగానో అలరించిన వీరు ఇప్పటిదాకా 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళకపోవడం నిజంగా వారి స్టార్టమును అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

కొత్తగా వచ్చిన హీరోలు సైతం 100 కోట్ల క్లబ్లో చేరుతూ తమ సత్తాన్ని చాటుతుంటే ఎప్పటినుంచే సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా ఈ హీరోలు ఈ క్లబ్ లోకి చేరకపోవడం వారికి ఎంతగానో అవమానకరంగా ఉంది.అక్కినేని అభిమానులు అయితే దీనిని ఎంతో భారంగా భావిస్తున్నారు. దీనికి తోడు వారు ఎంచుకుంటున్న సినిమాలు కూడా ఆ స్థాయిలో లేకపోవడం, అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

దాంతో ఇప్పుడు మరొక సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇటు అక్కినేని అఖిల్ కూడా హిట్ కొట్టడానికి చాలా ఆపోసఫాలు పడుతున్నాడనే చెప్పాలి. ఆ మోస్తరు విజయం తో ఆయన తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినా అఖిల్ నిలదొక్కుకుని నాలుగో సినిమా తో విజయాన్ని అందుకున్నాడు. అంటే అది సామాన్యమైన విషయం కాదు.  ఇక నాగార్జున వయసు అయిపోయిన హీరో అవడంతో ఆయనపై అంతటి స్థాయిలో బడ్జెట్ లు పెట్టగలిగే నిర్మాతలు ముందుకు రాకపోవడం ఈ హీరోలు ఎప్పుడూ ఏ స్థాయిలో సినిమాలను చేస్తారో అన్నదానికి ప్రశ్నలుగా మిగులుతున్నాయి. ఇప్పుడు అందరి ఆశ కూడా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పైన ఉంది. ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకుని అక్కినేని అభిమానుల ను ఖుషీ చేస్తూ వారిని ఆనందపరుస్తుందని అందరూ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: