దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో లలో కాఫీ విత్ కరణ్ షో  ఒకటి. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా  6 సీజన్ లను కంప్లీట్ చేసుకున్న ఈ షో తాజాగా 7 వ సీజన్ ను కూడా ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సీజన్ 7  లో కూడా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా కొంత మంది సెలబ్రెటీలతో ముచ్చటించిన కరణ్ జోహార్ అనేక ఆసక్తికరమైన విషయాలను వారితో పంచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే లు గెస్ట్ లుగా విచ్చేశారు. కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే లు పాల్గొన్న ఎపిసోడ్ జూలై 28 వ తేదీన రాత్రి 7 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాఫీ విత్ కరణ్ నిర్వాహక బృందం విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే లకు సంబంధించిన ఎపిసోడ్ టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ లో కరణ్ జోహార్,  విజయ్ దేవరకొండ  తో అనేక ఆసక్తికరమైన విషయాలను మాట్లాడాడు. ఈ షో లో విజయ్ ఫ్లింగ్స్ మరియు వన్ నైట్ స్టాండ్‌ల గురించి బోల్డ్‌గా మాట్లాడాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ నిర్వాహక బృందం విడుదల చేసిన విజయ్ దేవరకొండ , అనన్య పాండే లాలూ సంబంధించిన ఎపిసోడ్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరి పూర్తి ఎపిసోడ్ విడుదల అయిన తరువాత ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా  ఉంటే కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన లైగర్ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. లైగర్ మూవీ ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: