పవన్ కళ్యాణ్ విలాసాలకు చాల దూరంగా ఉంటాడు అని అంటూ ఉంటారు. టాప్ హీరోలందరికీ అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉన్నప్పటికీ పవన్ మాత్రం తన కార్ల విషయంలో విలాసాల జోలికి వెళ్ళడు. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ లేటెస్ట్ గా నిర్మిస్తున్న ఒక ఫామ్ హౌస్ కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.  


పవన్ కు గండిపేట చిలుకూరుల మధ్య 16 ఎకరాల ప్రాపర్టీ ఉంది. అక్కడ పవన్ తనకు ఇష్టమైన సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఒక చిన్న ఫామ్ హౌస్ ను కూడ కట్టుకున్నాడు. అక్కడ పవన్ చాల ఆవులు గేదెలు కూడ పెంచుకుంటున్నాడు. ఖాళీ దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ తన ప్రియ మిత్రుడు త్రివిక్రమ్ తో కలిసి అక్కడకు వెళ్ళి తమకు ఇష్టమైన పుస్తకాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అంటూ ఉంటారు.


ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పాత ఫామ్ హౌస్ ను పూర్తిగా మార్చివేసి అధునాతన హంగులతో ఒక భారీ ఫామ్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు చాల వేగంగా జరుగుతున్నాయని తరుచు పవన్ తన ఫామ్ కడుతున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పవన్ అక్టోబర్ నుండి మొదలుపెట్టబోతున్న బస్సు యాత్రకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేసే విషయంలో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


షూటింగ్ ల బంద్ అనుకున్న విధంగా లేకపోతే తాను నటించవలసిన సినిమాల షూటింగ్ లు పూర్తి చేస్త్గాను తన నిర్మాతలతో చెపుతున్నప్పటికీ ప్రస్తుతం పవన్ చేస్తున్న రెండు పడవల ప్రయాణం మధ్య ఎంతవరకు పవన్ నటించవలసిన సినిమాల షూటింగ్ పూర్తి అవుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు కూడ ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: