ఇక సూపర్‌ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు మహేష్ బాబు.ఇక మహేష్ పుట్టిన రోజు అంటే చాలు అభిమానులకు చాలా పెద్ద పండగే అని చెప్పాలి. ఇక మహేష్ బర్త్‌ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్‌. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో మరింత క్వాలిటీ అయిన 4 కే వర్షన్‌ను దేశ విదేశాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 9 వ తేదీన వేసే స్పెషల్‌ షోకు సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి.


సూపర్ స్టార్ మహేష్ మూవీ జోరు చూసిన పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌.. పవన్‌ కళ్యాణ్ బర్త్‌డేను కూడా ఇదే రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.పవర్‌ స్టార్‌ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ మూవీగా నిలిచిన జల్సా సినిమాను రీ మాస్టర్డ్ వర్షన్‌ రిలీజ్ చేయాలంటూ ఆ సినిమా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది.మహేష్ బాబు బర్త్‌ డే విషయంలో చాలా ముందు నుంచే హడావిడి మొదలైంది. పోకిరి సినిమా రీ రిలీజ్ విషయంలోనూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌.కానీ పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో మాత్రం ఆ సందడి కనిపించటం లేదు. 


సెప్టెంబర్ 2 వ తేదీ న పవర్‌ స్టార్ బర్త్‌ డే. ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నా కూడా రీ రిలీజ్‌లకు సంబంధించిన ప్రకటనలేవి ఇంతవరకు రాలేదు. మరి అభిమానుల డిమాండ్‌ తరువాతైన అలాంటి ఎనౌన్స్‌మెంట్ ఏదైనా వస్తుందేమో అనేది చూడాలి. ఇక ఇండస్ట్రీలో పవన్ మహేష్ క్రేజ్ అయితే మాములుగా ఉండదు. ఈ ఇద్దరు హీరోల్లో చాలా సిమిలర్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఇద్దరు  కూడా చాలా సింపుల్ గా ఉంటారు. అదే ఈ హీరోలకు రికార్డు స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.మరి పవన్ కళ్యాణ్ సినిమా పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: