రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మరొకసారి ప్రభాస్ అభిమానులకు కాలర్ ఎగురు వేసుకొనే డీల్ ఒకటి కుదిరినట్లుగా సమాచారం. ఇక ప్రభాస్ ఆదిపురష్ సినిమా కోసం ఓటిటి డీల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని గుర్తింపు ఈ సినిమాకి దక్కినట్లు తెలుస్తోంది. దీంతో మరొకసారి ఆల్ ఇండియా రికార్డును ప్రభాస్ సైతం దక్కించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


పూర్తి వివరాల్లోకి వెళితే.. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ఆదిపురుష్ . ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వారు హోల్సేల్ ధరగా రూ.250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ ఓమ్ రౌత్ దాదాపుగా ఈ సినిమా కోసం రూ  500 కోట్ల రూపాయలతో తెరకెక్కించడం జరుగుతుంది ఈ సినిమా గ్రాఫిక్స్ టెక్నాలజీతో భారీగా రూపొందించడం జరుగుతున్నట్లు సమాచారం. ఒక అద్భుతమైన వరల్డ్లోకి ప్రేక్షకులను తీసుకొని వెళ్లబోతున్నట్లుగా చిత్ర బృందం తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు దీంతో ఈ సినిమా పైన అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పవచ్చు.


ఆ అంచనాలు కారణంగానే ప్రముఖ ఓటీటి సంస్థ ఈ సినిమాని పోస్ట్ క్రియేటికల్ రైట్స్ ఫ్రీ క్రియేటికల్ రైట్స్ అంత ధరకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం ముంబై వర్గాల ద్వారా అందుతున్నది. కేవలం ఇండియన్ లాంగ్వేజ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ సినిమా అన్ని భాషలలో విడుదల చేయడానికి డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్నది రావణుడి పాత్రలు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా విజయవంతం అయ్యిందంటే చాలు దాదాపుగా ఏ సినిమా కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందని అభిమానుల సైతం భావి స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: