దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతారామం. ప్రేమ కథ చిత్రం గా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ప్రేమ కథ సినిమాలను ఎంతో అందంగా రూపొందించే దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు.

ఆయన ఇప్పటివరకు రూపొందించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. అయితే ఆ సినిమాలలో ఏదో ఒక చిన్న పొరపాటు చేయడంతో సదరు సినిమా ఈ దర్శకుడికి విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయాయి. అయితే ఆయన ఇప్పటినుంచి తన సినిమాల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండరని, ముఖ్యంగా ద్వితీయార్థం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించి మరి ఈ సినిమాను చేశాడు.  ఆ విధంగా నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం ఎంతగానో మెప్పిస్తుంది. క్లాస్ ప్రేక్షకులనే టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమకు కావలసిన విజయం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగా వర్కౌట్ అవడంతోనే ఈ చిత్రానికి మంచి విజయం వచ్చిందని చెబుతున్నారు ప్రేక్షకులు. ఇటీవలే టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దాంతో ఈ వారం వచ్చే సినిమాలు తప్పకుండా హిట్ అవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటుంది. ఇంకొక వైపు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన బింబిసారా చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలా ఈ వారం ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించింది అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: