బిగ్ బాస్ షో తెలియని ప్రేక్షకులు అంటూ ఉండరు.ఎప్పటినుంచో బుల్లితెర ఇండస్ట్రీలో ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇకపోతే వర్చువల్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.అయితే ఇక హిందీలో అయితే ఏకంగా కొన్ని పదుల సంఖ్యలో సీజన్ లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే .ఇక ఇప్పుడు తెలుగులో కూడా 5 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరవ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. ఇకపోతే  ఈ ఆరవ సీజన్లో సరికొత్తగా సామాన్యుడు కూడా పాల్గొనబోతున్నాడు అంటూ హోస్ట్ నాగార్జున వెల్లడించారు.

ఇక  ఇప్పటివరకు బిగ్బాస్ సీజన్ సిక్స్లోకి పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. పోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా ఉండేది వీళ్లేనా.. కాదా..అనేది చెప్పలేము కానీ ఇప్పుడు చెప్పబోయే పేర్లు మాత్రం బయటకి వస్తున్నాయి.అయితే ప్రముఖ యాంకర్ మంజూష.. మొన్నటివరకు జబర్దస్త్ లో యాంకర్ గా వచ్చేది ఈమె అంటూ ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత రష్మీ నే యాంకర్ గా కొనసాగిస్తున్నామని నిన్నటి ఎపిసోడ్ ద్వారా స్పష్టం చేసింది మల్లెమాల. పోతే దీంతో ఇప్పుడు మంజూష బిగ్ బాస్ 6 షో లో కనిపించే అవకాశం ఉంది అని సమాచారం.అంతేకాదు ఆశా షైనీ..

తెలుగులో పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ లో ఒకరిగా ఉన్నారని సమాచారం.అంతేకాదు ప్రీతి అస్రానీ బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లలో ఈమె కూడా ఒకరు అని  తాజా సమాచారం.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం అవకాశాలు లేక ఒడిదుడుకులలో తన కెరీర్ ను కొనసాగిస్తున్న సుమంత్ ప్రస్తుతం బిగ్ బాస్ 6 ద్వారా సందడి చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.అయితే ఇక వేరే కాకుండా మాస్టర్ భరత్, సీరియల్ యాక్టర్ కౌశిక్.. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన కుషిత, ప్రముఖ ఆర్టిస్ట్ సంజనా చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, ట్రాన్స్ జెండర్ తన్మయి ఉన్నారని సమాచారం.ఇదిలావుంటే ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్లతో పాటు కొంతమంది బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకున్నారని సమాచారం. ఇకపోతే  బిగ్ బాస్ 6 ఏ స్థాయిలో రేటింగ్ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: