రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లిచూపులు అనే సినిమాతో ఒక సాదా సీదా హీరో గా ఎంట్రీ ఇచ్చి క్లాసిక్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసాడు అని చెప్పాలి. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో ఇప్పటికీ ఎంతోమంది యువ హీరోలకు సాధ్యం కానీ వంద కోట్ల వసూళ్ల జాబితాలో చేరిపోయాడు విజయ్ దేవరకొండ.

 ఇక ఆ తర్వాత కూడా వరుస సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం గిరగిరా తిరిగేస్తూ ఉన్నాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కి ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఈ ఆటిట్యూడ్ సినిమాల్లో బాగుంటుంది. కానీ నిజ జీవితంలో  మాత్రం కొన్నిసార్లు విమర్శల పాలు చేస్తూ  ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ విమర్శలకు దారితీసింది అని చెప్పాలి.


 ఇక లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే ప్రెస్ మీట్ సమయంలో ఏ హీరో అయినా సరే కాస్త హుందాగానే వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ విజయ్ దేవరకొండ ప్రవర్తించిన విధానం మాత్రం అస్సలు బాగాలేదు అన్న టాక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రెస్మీట్లో ఎదురుగా టేబుల్ పై కాళ్ళు పెట్టుకుని కూర్చోవడం అక్కడికి వచ్చిన జనాలకు అస్సలు నచ్చలేదు. దీని గురించి మీడియా ప్రశ్నిస్తే స్మోకింగ్ ఆన్సర్ చెప్పాడు. మీరు కూడా హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ప్రశ్నలు అడగవచ్చు ఆన్సర్ చెప్పాడు.. అయితే ఇది కొంత మంది అభిమానులకు నచ్చిన మరికొంతమందికీ మాత్రం నచ్చక విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: