దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కిస్తున్నాడు అని పేరు కలిగిన హను రాఘవపూడి సీతా రామం మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై విడుదలకు ముందే సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా విడుదలకు ముందే సినీ ప్రేమికుల్లో మంచి కలిగి అంచనాలు ఉండడం వల్ల ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ అయిన జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 17 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో అతి తక్కువ రోజుల్లోనే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇప్పటి వరకు 15 రోజుల  బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 30.35 కోట్ల షేర్ , 60.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో సీతా రామం  మూవీ 15 రోజులు ముగిసే సరికి 13.35 కోట్ల లాభాలను అందుకని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్  స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా , తరుణ్ భాస్కర్ ,  భూమిక చావ్లా ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: