కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లో ధనుష్ ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్లకు చేరినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో ఈ మార్కును చేరుకున్న హీరోలు ఏ ఒక్కరూ లేరు కూడా.. 11 మిలియన్లు ఫాలోవర్స్ ను ట్విట్టర్లో సంపాదించిన ధనుష్ కోలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా నిలిచారు. ఈ విషయంలో ధనుష్ అభిమానుల సైతం చాలా సంబరాలు చేసుకుంటున్నారు. సౌత్ లో ఈ స్థానంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు ధనుష్ కంటే స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా తమ హీరోకి ఇలాంటి గౌరవం దక్కిందని సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేస్తూ ఉన్నారు.


ధనుష్ కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా నిలిచారు కానీ సౌత్ ఇండియాలో మాత్రం ధనుష్ కు రెండవ స్థానం దక్కింది.. మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎప్పుడు 10 మిలియన్లను మరియు 11 మిలియన్ ఫాలోవర్లను క్రాస్ చేసి ముందుకు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ ని ట్విట్టర్లో ఫాలో అయ్యే వారి సంఖ్య దాదాపుగా 13 మిలియన్లు ఉన్నట్లుగా సమాచారం. ఇక బాలీవుడ్ హీరోలలో కూడా చాలామంది మహేష్ బాబు, ధనుష్ వెనక్కే ఉన్నారని చెప్పవచ్చు.


సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు ధనుష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. కోటికి పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో ట్విట్టర్ లో మరిన్ని రికార్డులు నమోదు చేయడం ఖాయమని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఇక ధనుష్ చిత్రాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుసగా తమిళంలో పలు సినిమాలను నటిస్తూ బిజీగా ఉన్నారు.అలాగే తెలుగు, హిందీ వంటి భాషలలో కూడా నటిస్తున్నారు తెలుగులో సార్ అనే చిత్రంతో ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విచిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: