సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ డం సంపాదించి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఉండగా మహేష్ బాబుకి వరుసకు బావ అయ్యేటటువంటి సుధీర్ బాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈయనకు మంచి నటుడిగా పేరు అయితే వచ్చింది కాని ఇండస్ట్రీలో సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి.ఇలా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈయన తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నిన్న సాయంత్రం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా సుధీర్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరి సుధీర్ బాబును ప్రశ్నిస్తూ మహేష్ బాబు నటించిన పాత సినిమాలలో తిరిగి ఆయన నటించాల్సి వస్తే ఏ సినిమాలో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సుధీర్ బాబు చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు.


ఈ సందర్భంగా సుధీర్ బాబు సమాధానం చెబుతూ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలో తిరిగి ఆయన మళ్లీ నటిస్తే బాగుంటుందంటూ మహేష్ బాబు కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమా గురించి ప్రస్తావించారు. ఇలా ఈ డిజాస్టర్ సినిమా పేరు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావడం సుధీర్ బాబుకు ఏమాత్రం నచ్చలేదని,ఇంటెలిజెంట్ స్ర్కీన్‌ప్లేతో సాగిన ఈ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేకపోవడం తనకు బాధ కలిగించిందని తెలిపారు. ఇలా ఓ మంచి సినిమాని డిజాస్టర్ చేయడంతో ఈ సినిమాని మహేష్ బాబు తిరిగి నటిస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా సుధీర్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్ చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. అప్పుడు రొట్ట రొటీన్ సినిమాలు నడుస్తున్న నేపథ్యంలో నేనొక్కడినే లాంటి ప్రయోగం చేశాడు మహేష్ బాబు. అయితే ఆ టైంలో సోషల్ మీడియా డెవలప్ కాలేదు. రొట్ట సినిమాలకు అలవాటు పడ్డ ఆడియన్స్ ఈ సినిమాని అర్ధం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి సినిమాని అనవసరంగా ఫ్లాప్ చేశామంటూ బాధ పడుతున్నారు. ఒక్క సుధీర్ మాత్రమే కాదు. మహేష్ ఫ్యాన్స్ ఇంకా చాలా మంది ఆడియన్స్ ఇప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు అసంతృప్తిగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: