నందమూరి నటసింహం  బాలకృష్ణ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ వయసులో కూడా తన సత్తా చూపిస్తూ...యంగ్ హీరోలకి పోటీ గా నిలుస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తు ఏ మాత్రం కాళిలేకుండా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలావుంటే ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణ పనైపోయింది అనుకున్న టైంలో బోయపాటి శ్రీను సింహా, లెజెండ్ , అఖండ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి.. ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది రుచి చూపించాడు. అంతేకాకుండా బాలయ్య కి ఉన్న మాస్ ఇమేజ్ ఏంటనేది కూడా ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.

అయితే  అప్పటి నుండి బాలయ్యతో సినిమాలు చేయడానికి యంగ్ డైరెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే సీనియర్ హీరోలందరి కంటే బాలయ్య.. చాలా డెడికేటెడ్ గా వ్యవహరిస్తాడు.అయితే ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేయడానికి సహకరిస్తాడు.కాగా  మేకింగ్ కాస్ట్ అస్సలు పెరగనివ్వడు. అందుకే బాలయ్యతో సినిమా చేయడానికి నిర్మాతలు కూడా వెనకడుగు వేయరు.ఇకపోతే  సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , దిల్ రాజు , గీతా ఆర్ట్స్ సంస్థలు కూడా ఇప్పుడు బాలయ్యతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. కాగా బాలయ్యతో సినిమా చేయాలని యంగ్ డైరెక్టర్స్ చాలా మంది ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే బాలయ్య మాత్రం తనకు ఓ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో మళ్లీ సినిమా చేయాలని చూస్తున్నాడట.ఇదిలావుంటే ఇక శ్రీవాస్ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇది పూర్తయ్యాక బాలయ్యతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇకపోతే ఆల్రెడీ ఓ కథ బాలయ్యకు వినిపించాడు. కాగా అది బాలయ్యకు నచ్చింది.ఇక  గోపీచంద్ సినిమా పూర్తయ్యాక అతను బాలయ్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో వీరి కాంబినేషన్లో డిక్టేటర్ మూవీ వచ్చింది. ఇక ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ బాలయ్యను శ్రీవాస్ అభిమానులు మెచ్చే విధంగా చూపించాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: