మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఇండియన్ 2 . కమల్ హాసన్ , శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఇండియన్ 2 . కమల్ హాసన్ , శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.భారతీయుడు సినిమా ఎంతటిపెద్ద భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెల్సు..

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కమల్ హాసన్ అంటే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ 2 లో కూడా ఎవరూ చేయని కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నాడట మన లోకనాయకుడు.

క్రేజీ టాక్ ప్రకారం కమల్ హాసన్ ఈ చిత్రంలో ఏకంగా 14 భాషల్లో మాట్లాడబోతున్నాడట. తాజా అప్‌డేట్ ఏంటంటే..ఇండియన్ 2లో 14 భాషల్లో వచ్చే 10 నిమిషాల డైలాగ్ ఉండనుందట. అంతేకాదు ఈ డైలాగ్ కూడా సింగిల్ షాట్‌లో ఉండబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ డైలాగ్ చెప్పడం కోసం కమలహాసన్ గారు ఓ రేంజ్ లో ప్రాక్టీస్ చేసారంట..ఇక ఈ సన్నివేశం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోండగా..సీన్‌లో కమల్ హాసన్ స్టన్నింగ్ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టి..సెట్స్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ షాక్ అయ్యేలా చేశాడని కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం .

కమల్‌-శంకర్ ప్రాజెక్టుపై తాజా న్యూస్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా..బాబీ సింహా, సిద్దార్థ్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని ఇతర కీ రోల్స్ చేస్తున్నారు.దాంతో ఈ మూవీ మీద పెద్ద హైప్ వచ్చేసింది… కమల్ అభిమానులు వెయ్యి కళ్ళతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు…

లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌. ఇప్పటికే రిలీజైన కమల్ హాసన్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: