కృష్ణంరాజు మరణం పరిశ్రమను విషాదంలో ముంచివేసింది. ఆయన కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. పెదనాన్న భౌతికకాయం వద్ద కన్నీరు పెట్టుకున్న ప్రభాస్ ని చూసి అభిమానుల గుండె ద్రవించి పోయింది.
ఎంత మంది ప్రముఖులు వచ్చినా ఆయన్ని ఓదార్చడం కష్టమైపోయింది. అంతలా కృష్ణంరాజుతో ప్రభాస్ కి అనుబంధం పెనవేసుకుంది. ఈ క్రమంలో కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఓ నెలరోజుల పాటు షూటింగ్స్ ని పూర్తిగా రద్దు చేసుకున్నారట.

ప్రభాస్ హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ప్రాజెక్ట్ కే, సలార్ షూటింగ్ దశలో ఉన్నాయి. దర్శకుడు నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ప్రభాస్ హోల్డ్ లో పెట్టాడట. ఇతర నటులకు కాల్షీట్స్ సమస్య వస్తుంది షూటింగ్ చేయాలని మొదట ప్రభాస్ భావించారట. అయితే కృష్ణంరాజు భార్య, పిల్లలు పడుతున్న మానసిక ఆవేదన చూశాక నిర్ణయం మార్చుకున్నారట.
కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఇలాంటి సమయంలో వాళ్లకు తన తోడు అవసరమని ఆయన భావిస్తున్నారట. నెలరోజుల పాటు వాళ్ళతోనే ఉండి జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం షూటింగ్ లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారట. దీంతో కొన్ని రోజుల పాటు ప్రభాస్ షూటింగ్స్ కి హాజరయ్యే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ప్రభాస్ నిర్ణయానికి ప్రసంసలు దక్కుతున్నాయి. పెదనాన్న కుటుంబానికి అవసరమైన సమయంలో ఇలా మద్దతుగా నిలబడటం గొప్ప విషయం అంటున్నారు.
ఇక కృష్ణంరాజు బీజేపీ పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధిష్టానం ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు మృతిపై స్పందించారు. నిన్న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా కృష్ణంరాజు నివాసానికి వచ్చారు. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కుటుంబాన్ని కలిశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం కృష్ణంరాజు సంస్కరణ సభలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: