తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయే హీరోల్లో టాలెంటెడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ టాలెంటెడ్ హీరో కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, కొంత కాలంగా శర్వాకు సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. దీంతో అతడు ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టాలన్న ఉద్దేశంతో 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వస్తున్నాయి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది.శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'కు 9 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 61 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి రూ. 5.35 కోట్లు షేర్, రూ. 8.90 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.


ఏపీ, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 5.35 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 44 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.29 కోట్లు షేర్‌, రూ. 19.25 కోట్లు గ్రాస్ వచ్చింది.సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.29 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29 లక్షల లాభాలు కూడా వచ్చాయి.దీంతో 2022లో 'బంగార్రాజు', 'డీజే టిల్లు', 'RRR', 'సర్కారు వారి పాట', 'డాన్', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'మేజర్', 'విక్రమ్', 'విక్రాంత్ రోణ', 'బింబిసార', 'సీతా రామం', 'బ్రహ్మాస్త్ర' తర్వాత హిట్ అయిన 13వ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: