సినీ పరిశ్రమ లో వరుస విషాదాలు చోటు చేసు కుంటూనే ఉన్నాయి. నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత లు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూ నే ఉన్నారు.
గత 3 నెలల్లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు.ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తో షాక్ కు గురైన ఇండస్ట్రీ ఇంకా కోలుకోక ముందే రష్మీ జయ గోపాల్, వంటి సినీ నటులు మరణించారు. తాజాగా మరో కమెడియన్ కూడా మరణించినట్టు తెలుస్తుంది.

ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ్ ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు.ఇతని వయసు 58 సంవత్సరాలు. ఆగస్టు 10న ఇతను జిమ్‌ చేస్తుండ గా ఇతను గుండెపోటు కి గురవ్వడం తో కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.మొదట వైద్యులు రెండు సార్లు సీపీఆర్ చేసి పర్వా లేదు అని చెప్పారట. తర్వాత పరిస్థితి మళ్ళీ విషమించడం తో వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన మెదడు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందట.
అయితే అతను కోలుకుంటున్నట్లు ఇటీవల అతని సోదరుడు డిపో శ్రీ వాస్తవ కూడా చెప్పు కొచ్చాడు. కానీ ఇంతలోనే ఇలా జరిగినట్లు తెలుస్తుంది. రాజు శ్రీ వాస్తవ అనేక స్టాండప్ కామెడీ షోలతో పాపులర్ అయ్యాడు. 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్', 'కామెడీ సర్కస్', 'ది కపిల్ శర్మ షో', 'శక్తిమాన్' వంటి టీవీ షోస్ ద్వారా అతను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 'మైనే ప్యార్ కియా', 'తేజాబ్', 'బాజీగర్' వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించి తన నటన తో ఇతను ప్రేక్షకుల ను మరింత గా ఆకట్టుకున్నాడు.రాజు శ్రీవాస్తవ మరణానికి చింతిస్తూ కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: