మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే..రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ఖైదీ నెంబర్ 150 మరియు సై రా నరసింహ రెడ్డి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఇప్పుడు 5 వ తారీఖున ఆయన నటించిన కొత్త సినిమా గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధంగా ఉంది..ఈ సినిమా మీద ఇండస్ట్రీ లో ప్రస్తుతం పాజిటివ్ బజ్ అయితే బాగానే ఉంది..సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి..ఇక ఈ సినిమా తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ బాబీ తో వాల్తేరు వీరయ్య, మహీర్ రమేష్ తో భోళా శంకర్ మరియు యంగ్ డైరెక్టర్ వెంకీ కుదుముల తో సినిమాలు చెయ్యబోతున్నాడు..వీటితో పాటు మెగాస్టార్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టినట్టు సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ఒక వార్త  అయితే జోరుగా ప్రచారం సాగుతుంది.


ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా మరియు కొరియోగ్రాఫేర్ గా కొనసాగుతున్న ప్రభుదేవా దర్శకత్వం లో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడట..స్పానిష్ భాషలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఒక రిటైర్డ్ డాన్ కి సంబంధించిన స్టోరీ చిరంజీవి కి ఎంతగానో నచ్చిందట..ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని..తన వయస్సుకి తగిన పాత్ర అని చిరంజీవి బలంగా నమ్మినట్టు సమాచారం..ఈ రీమేక్ కి ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నాడట..రీమేక్ సినిమాలు తియ్యడం లో ప్రభుదేవా దిట్ట..తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రీమేక్స్ చేసి సూపర్ హిట్స్ అయితే కొట్టాడు..కానీ 2007 వ సంవత్సరం లో చిరంజీవి తో ఆయన చేసిన 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా మాత్రం పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.


 


మళ్ళీ ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్తలు రావడం తో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారట...మరో ఫ్లాప్ ఇచ్చిన కూడా నమ్మి మరోసారి అవకాశం ఇచ్చిన చిరంజీవి ప్రభుదేవా పెద్ద హిట్ ఇస్తాడో లేదో చూడాలి..ప్రభుదేవా మెగాస్టార్ లేటెస్ట్ చిత్రం 'గాడ్ ఫాదర్' లో 'తార్ మార్ తక్కర్ మార్' అనే పాటకి కొరియోగ్రఫీ చేసాడు..సల్మాన్ ఖాన్ - చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సాంగ్ కి థియేటర్స్ లో అదిరిపొయ్యే రెస్పాన్స్ వస్తుందట..ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..మరి థియేటర్స్ లో ఈ పాటకి అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు అయితే ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: