హీరో రామ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది.తాజాగా ఈరోజు దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాని షూటింగ్ మొదలుపెట్టినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. బోయపాటి ర్యాపో షూటింగ్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అంటూ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి మొదలు కాబోతోందని చెప్పవచ్చు. రామోజీ ఫిలిం సిటీ లో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల ఎంపిక చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ అధికారికంగా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రామ్ ఎనర్జీ శ్రీ లీల అందంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని గ్రామ అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇక అంతే కాకుండా వీరిద్దరూ కూడా మంచి డాన్సర్స్ కావడం చేత అందుకు తగ్గ ఎనర్జీని డైరెక్టర్ ఇచ్చారంటే చాలు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.
ఈ చిత్రాన్ని సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు. అఖండ సినిమాతో బోయపాటి శ్రీను , థమన్ మ్యూజిక్ తో బాగా అదరగొట్టేసారని చెప్పవచ్చు. ముఖ్యంగా అదే తరహా వైపుని ఈ సినిమాకి క్రియేట్ చేసే విధంగా బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి పలు భాషలలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇక మొదటిసారి బోయపాటి శ్రీను రామ్ కలిసి నటించబోతున్న పాన్ ఇండియా చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల ప్లాన్ ని కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: