చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశమంతటా ఫేమ్ తెచ్చుకుంది అవికా గోర్. ఇక తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తుంది.
ఒక పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు తెరకెక్కిస్తోంది. తాజాగా అవికా గోర్ హీరోయిన్ గా నిర్మాతగా కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో ఓ సినిమాని తెరక్కిస్తుంది. ఇప్పటికే తారా అనే ఒక సినిమాని తెరకెక్కిస్తోంది. నిర్మాతగా అవికాకి ఇది రెండో సినిమా.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ఉమాపతి అనే సినిమా రూపొందిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా, అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది.

సత్య ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కే. కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిదా మూవీకి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. రాఘవేంద్ర కెమెరా మెన్ గా, సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దీపావళి కానుకగా ఈ ఉమాపతి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్ లుక్ ఆకట్టుకుంటోంది. యమహా బైక్ పై పంటపొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమ ముచ్చట్లు జరుపుతున్నట్లు చూపించారు. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కి తోడు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు జోడిస్తూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గ లొకేషన్స్ ఎంచుకొని ఈ సినిమాను షూట్ చేశారు. ఈ మూవీలోని అవుట్ అండ్ ఔట్ కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, అన్ని వర్గాల ఆడియన్స్మూవీ చూసి ఎంజాయ్ చేయడం పక్కా అని అంటున్నారు దర్శకనిర్మాతలు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: