ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి ఏం బాగాలేదనే చెప్పాలి. నేషనల్ వైడ్ గా క్రేజ్ వున్నా కూడా అతని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఆఫర్లు కూడా తగ్గుతున్నాయి. ఒకవేళ వచ్చినా అవన్నీ కూడా ప్లాపయ్యే సినిమాలి.అర్జున్ రెడ్డి , గీతాగోవిందం తర్వాత అలా చెప్పుకోదగిన సినిమానే అతని ఖాతాలో పడలేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ సినిమాను తీయగానే ఈ సినిమా సక్సెస్ ఊహించని విధంగా ఉంటుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సీన్ అంతా కూడా దెబ్బకు రివర్స్ అయింది. విడుదల తర్వాత లైగర్ సినిమా ఊహించని దారుణమైన పరాజయం మూటగట్టుకుంది.దీంతో విజయ్ దేవరకొండను మళ్ళీ కొండ ఎక్కించేందుకు డైరెక్టర్ హరీశ్ శంకర్ రంగంలోకి దిగుతున్నారని.. ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు కమిట్ అయిన హరీశ్ శంకర్ పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.


 ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమాలతో పాటు రాజకీయంగా ఫుల్ బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే దిల్ రాజు చొరవతో హరీష్ శంకర్- విజయ్ దేవరకొండ మీట్ జరిగిందని వార్త ఆమధ్య బాగా వినిపించింది.అయితే అది నిజమో కాదో ఇంకా క్లారిటీ అనేది రాలేదు. వీరి నుంచి కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు.ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమా చేస్తున్న విజయ్.. ఆ సినిమా కూడా ఆగిపోవడంతో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో వున్నాడు. ఫుల్ డైలామాలో పడ్డాడు.ఓవర్ నైట్ స్టార్ గా దేశావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఇలా తన ఓవర్ కాంఫిడెన్స్ తో సరిగ్గా కథలను ఎంచుకోలేక వరుస ప్లాపులు ఎదురుకుంటున్నాడు. తన తోటి హీరోలు నిఖిల్, అడివి శేష్ లు మంచి మంచి కథలతో దూసుకువెలుతూ పాన్ ఇండియా హిట్లు కొడుతుంటే విజయ్ మాత్రం వరుస ప్లాపులతో ఏం చెయ్యాలో అర్ధం కాక ఫుల్ డైలామాలో వున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: