ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా ప్రతి సినిమాలో సరికొత్తగా కనిపిస్తు అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాద్ షా మూవీ వరకు దాదాపుగా ఎప్పుడూ ఒకే లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఒక్కసారిగా మారిపోయారని చెప్పవచ్చు. rrr చిత్రంలో ఒకేసారి గోండు బొబ్బిలిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సరికొత్త మేకోవర్సులతో సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో ఇంటర్నెట్ ని షేర్ చేస్తోంది.

న్యూ డే న్యూ వెబ్ అనే క్యాప్షన్ తో.. పాపులర్ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ తో ఉన్న ఒక ఫోటోని ఎన్టీఆర్ షేర్ చేయడం జరిగింది. ఇక ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ వావ్ అనిపించుకుంటున్నాడు అభిమానులతో. జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ లో ఫిదా అవుతూ ఉన్నారు. పది సంవత్సరాల క్రితం బాద్ షా సినిమాలో ఎలా కనిపించారు ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తు ఉన్నారు. అయితే ఇదంతా కేవలం ఒక కమర్షియల్ యాడ్ కోసం సెట్ చేశాడేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇది సినిమా కోసం లేకుంటే యాడ్ కోసమా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అభిమానులు మాత్రం ntr -30 వ సినిమా కోసమే ఈ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రాము లో తన కొత్త లుక్ లో షేర్ ఫోటో  క్షణాలలో అది చాలా వైరల్ గా మారుతోంది.#MAN OFMASSEN ntr అనే హ్యాష్  ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో చాలా వైరల్ గా మారుతోంది.RRR సినిమా తర్వాత కొన్నాళ్లపాటు ఎన్టీఆర్ కనిపించలేదు. బింబిసారా సినిమా ఈవెంట్లో కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత జపాన్ కి వెళ్లి చాలా స్లిమ్ముగా మారి స్టైలిష్ లుక్ లో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: