సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కాలం తరువాత మళ్లీ కలిసి పని చేస్తున్నారు. `ఖలేజా` తరువాత వీరిద్దరి కాంబినేషన్ కు చాలా గ్యాప్ వచ్చింది.ఇక మళ్లీ ఇన్నేళ్ల తరువాత వీరిద్దరు కలిసి SSMB28 కోసం పని చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న మూడు నెలల తరువాత ఈ సినిమాని ఫైనల్ గా సెట్స్ పైకి తీసుకెళ్లారు.సెప్టెంబర్ 12 వ తేదీన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టారు. మహేష్ తో పాటు కొంత మంది ఫైటర్స్ కూడా పాల్గొనగా అన్బు అరివు హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేశారు. అన్న పూర్ణ స్టూడియోస్ లో మూడు రోజుల షూటింగ్ తరువాత చిత్ర బృందం షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చడం జరిగింది.అక్కడ కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసిన తరువాత ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని తరువాతి షెడ్యూల్ కు బ్రేకిచ్చింది. ఆ సమయంలోనే మహేష్ తల్లి ఇందిరా దేవి గారు మృతి చెందడం ఆ తరువాత ఆ బాధని మర్చిపోడానికి మహేష్ ఫ్యామిలీతో కలిసి లండన్ విహార యాత్రకు వెళ్లడం తెలిసిందే.


ఇక మళ్ళీ తిరిగి మహేష్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ సినిమా షూటింగ్ తరువాతి షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ కి వినిపించలేదట. ఆ కారణంగానే ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ బాబుకి త్రివిక్రమ్ వినిపించాడట. అయితే తరువాతి షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా వుండాలి. మహేష్ తో కలిసి చేసే కాంబినేషన్ సీన్స్ వున్నాయట. అయితే ఇటీవల పూజా హెగ్డే కాలికి గాయం అవ్వడంతో తను రెస్ట్ తీసుకుంటోంది. డిసెంబర్ నెలకి కానీ తను సెట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు.అందువల్ల ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ని డిసెంబర్ నెలలో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు పూజా హెగ్డే గాయం నయం కానుంది కాబట్టి తను కూడా సెట్ లోకి రావడానికి రెడీగా వుంటుంది. అందుకే డిసెంబర్ లో తదుపరి షెడ్యూల్ ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.ఇలా ఏదో ఒక కారణంతో సినిమా షూటింగ్ పోస్టుపోన్ అవుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: