ఇక సమంత ప్రధాన పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'యశోద'. ఈ మూవీ ఈ నెల 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా  విడుదల చేసింది నిర్మాణ సంస్థ. అలాగే సమంత కు హిందీలో ఇది తొలి థియేట్రికల్ రిలీజ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా మొదటి రోజు నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.ఈ సినిమా పై విడుదలకు ముందు నుంచే అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశారు అభిమానులు. ఇక ఇదే సినిమాకు మంచి బిజినెస్ ను చేసిపెట్టింది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక రెండో రోజు శనివారం కూడా మంచి కలెక్షన్లు పుంజుకున్నాయనే చెప్పాలి.శనివారం ఏకంగా 4 కోట్ల రూపాయలు రాబట్టింది.


తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా యశోద చిత్రం 3 కోట్లకుపైగా షేర్ ఇంకా 6 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజున తెలుగులో 2.7 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 25 లక్షలు ఇంకా అలాగే మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది.. ఇక రెండు రోజుల తర్వాత ఈ సినిమా టోటల్ కలెక్షన్  వచ్చేసి 7.06 కోట్లకు చేరుకుంది.వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు. నిపుణుల అంచనా ప్రకారం 'యశోద' సినిమా 55 కోట్లకు పైనే ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం తెలుస్తుంది.అయితే ఈ మూవీ లో ప్రేక్షకులను ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. సరోగసి విధానం అలాగే అందులో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీపై దేశవ్యాప్తంగా మంచి టాక్ రావడంతో సమంత కు క్రేజ్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: