పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ మరియు కృతిసనన్ ప్రేమలో ఉన్నారు అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీరిద్దరు  ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే  వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్‌తో కృతిసనన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు అవకాశం వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానంటూ కృతిసనన్ చెప్పిన పాత ఇంటర్య్వూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలావుంటే ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ , కృతిసనన్ ప్రేమాయణంపై బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అయితే  వరుణ్‌ధావన్‌, కృతిసనన్ కలిసి నటించిన భేడియా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ధావన్‌, కృతి సనన్‌ కలిసి ఝలక్‌ ధిక్లా జా డ్యాన్స్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌లుగా హాజరయ్యారు.ఇక ఇందులో కృతిసనన్ పేరును మరొకరి హృదయం తలచుకుంటోంది, అతడి మనసు మొత్తం కృతి ప్రేమతో నిండిపోయిందని వరుణ్‌ధావన్ అన్నాడు. అంతేకాదు ఎవరి హృదయం అంటూ మరో గెస్ట్‌ కరణ్ జోహార్ .

వరుణ్‌ధావన్ మాటలను పొడిగించారు. కరణ్ ప్రశ్నకు... ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబాయిలో లేడు.ఇదిలావుంటే  మరో చోట దీపికా పడుకోణ్‌తో షూటింగ్‌లో ఉన్నాడంటూ వరుణ్ ధావన్‌ పేర్కొన్నాడు. ఇక ఆ హీరో పేరు మాత్రం అతడు వెల్లడించలేదు.అయితే వరుణ్ ధావన్ చెబుతున్న మాటలకు కృతిసనన్ చిరునవ్వులు చిందిస్తూ ఈ వీడియోలో కనిపించింది.ఇదిలావుంటే ఇక  ప్రస్తుతం దీపికా పడుకోణ్‌తో  కలిసి పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇకపోతే ప్రభాస్‌ ను ఉద్దేశించే వరుణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. అయితే వరుణ్ ధావన్ మాటలను బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ కృతిసనన్ ప్రేమలో ఉన్నది నిజమేనని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: