పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వంతో ఇప్పటికే ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం తేరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం మనకు తెలిసింది.

అలా సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన అభిమానుల కోరిక మేరకు తిరిగి హిందీలో సూపర్ హిట్ విజయం అందుకున్నటువంటి పింక్ మూవీని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమిక్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా మంచి గుర్తింపు పొందిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించగా , అంజలి , అనన్య  నాగళ్ళ , నివేత థామస్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మంచి అంచనాలను నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. 

అలాగే పవన్ కళ్యాణ్ కు రీ ఎంట్రీతో అద్భుతమైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ కు మంచి గుర్తింపు లభించింది. తాజాగా వేణు శ్రీరామ్ కు పవన్ కళ్యాణ్ మరియు అన్నా లేజేనోవా దంపతులు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ బహుమతులను పంపించారు. తన ఫేవరెట్ హీరో నుండి వచ్చిన బహుమతుల ఫోటోలను వేణు శ్రీరామ్ సతీమణి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ పవన్ మరియు అన్నా లేజేనోవా లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: