సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే గర్వించదగ్గ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు బాబీ సింహ. తమిళంలో ఈయన ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించాడు బాబి సింహ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా నటించాడు ఈయన. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు బాబీ సింహ. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాబి సింహ గురించి తెలుసుకోవడానికి

 తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపుతున్నారు. తమిళంలో ఆయన నటించిన జిగర్తాండ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డును దక్కించుకున్నాడు బాబి సింహ. బాబీ సింహ కి జాతీయ అవార్డు సైతం రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాబిసింహ ది తమిళనాడు అయినప్పటికీ ఈయనది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకి సంబంధించిన వ్యక్తి. ఈయన సొంత ఊరు విజయవాడ సమీపంలోని బందరు ప్రాంతం. తన పదవ తరగతి వరకు కృష్ణాజిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసినప్పటికీ డిగ్రీ విద్యాభ్యాసం కొరకు

 ఈయన కోయంబత్తూర్ కి వెళ్లడం జరిగింది. బాబీ సింహ కి చిన్నప్పటినుండే సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. సినిమాల్లో ఎలాగైనా అవకాశం సంపాదించుకోవాలి అని చాలా ఆడిషన్స్ కి వెళ్ళాడుమ్ అలా ఒక రోజు "కదలి సోదపువ్వదు ఎప్పటి" అనే సినిమాకి ఎంపికయ్యాడు బాబి. తొలి సినిమాతోనే నటుడుగా మంచి మార్కులను తెచ్చుకున్నాడు. దాని అనంతరం లవ్ ఫెయిల్యూర్ పిజ్జా వంటి సినిమాలలో నటించాడు. అలా తన కెరీర్ను 2014లో విడుదలైన జిగర్తాండ అనే సినిమాతో మలుపు తిరిగింది. అలా జాతీయస్థాయిలో నటుడిగా మంచి గుర్తింపును పొందాడు బాబి. ప్రస్తుతం ఏడాదికి 10 నుండి 15 సినిమాలు చేస్తూ సౌత్ లోనే ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేనంత బిజీగా ఉన్నాడు బావి సింహ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: