రాజావారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బావరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి అందులో కొన్ని మూవీ లతో పర్వాలేదు అనే రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సెబాస్టియన్ , సమ్మతమే , నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో మరికొన్ని రోజుల్లో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని బన్ని వాసు నిర్మించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 17 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. 

మూవీ యూనిట్ సెలబ్రేట్ బ్రేకప్ పార్టీ విత్ కిరణ్ అబ్బవరం అనే పేరుతో ఒక ఈవెంట్ ను జనవరి 29 వ తేదీన సాయంత్రం 6 గంటలకు కె స్ట్రీట్ డ్రైవ్ ఇన్ గోరకంటి ... వరంగల్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: