స్టార్ హీరోయిన్ గా ఎక్స్పరిమెంట్ మూవీస్ చేసే హీరోయిన్ లు ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ సమంత. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో విడిపోయిన తర్వాత ఎక్కువగా సినిమాలపైనే కాదు తన ప్రొఫెషనల్ కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఎక్కువగా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. ఇటీవల యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత త్వరలోనే గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న శాకుంతలం చిత్రంలో నటించబోతోంది.

అయితే ఈ భామ తన ఫోకస్ ని మొత్తం బాలీవుడ్ వైపు ఎక్కువగా పెట్టినట్లు తెలుస్తోంది. ఒకపక్క సౌత్ సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలకు దగ్గర కావాలని ప్లాన్ వేస్తోంది. ఈ క్రమంలోనే పాపులర్ అమెరికా సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న సిడి వెబ్ సిరీస్ ను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేసింది అమెజాన్ ప్రైమ్. ఒక కొత్త పోస్టర్ ను  ఆవిష్కరిస్తే ఈ విషయాన్ని తెలియజేసింది. దాన్ని మిషన్ ఈస్ ఆన్ ఇండియన్ సీటాడెల్  గా తెరకెక్కపోతున్నట్లు తెలియజేశారు.

సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో  ఈ ఫోటోలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోన్ లో  యాక్షన్ సీన్స్ కి వెళ్తే ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నారు.  ఫ్యామిలీ మెన్  వెబ్ సీరీస్ తెరకెక్కించిన రాజు నిడమూరు కృష్ణ డీకే ని ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ ధావన్. ఇకపోతే తాను మాయోసిటీస్ తో బాధపడుతున్న సమంత గత ఏడాది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.  తాజాగా హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఏడాదైనా వరుస సినిమాలతో బిజీగా ఉంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: