జబర్దస్త్ ప్రేమ పక్షులుగా ఎన్నో రోజులు విహరించిన రాకింగ్ రాకేష్ ,జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఫిబ్రవరి 24వ తేదీన శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతిలో ఏడుకొండల వాడి సాక్షిగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని .. కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. రాకింగ్ రాకేష్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మొదట్లో పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆయన చిన్నపిల్లలతో చేసే కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు ఇలా అన్ని వర్గాల వారు రాకింగ్ రాకేష్ స్కిట్ల కోసం తెగ ఆసక్తి చూపేవారు.
అయితే ఆ తర్వాత కాలంలో పిల్లలు పెద్ద వాళ్ళు అవ్వడంతో రాకింగ్ రాకేష్ కాస్త పెద్దవాళ్లతోనే స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.. ఆ తర్వాత కాలంలో చాలా మంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినా సరే ఆయన మాత్రం జబర్దస్త్ లో చేస్తూనే సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో జోర్దార్ సుజాతా ను కూడా తన స్కిట్లో చేర్చుకొని ఆమెపై ప్రేమను వలకబోస్తూ నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు స్కిట్లు చేశారు. మొదట్లో ఇవన్నీ టిఆర్పి రేటింగ్ కోసమే మల్లెమాల  ఇలా చేయిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
వీరు కుటుంబాల వాళ్ళకి తమ ప్రేమ గురించి వెల్లడించగా వారు కూడా వీరి ప్రేమను అంగీకరించడం జరిగింది. మరోవైపు గత ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని కూడా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఇంట్లో ఘనంగా నిర్వహించింది. ఆ తర్వాత వీరిద్దరు వెకేషన్ కి కూడా వెళ్లొచ్చారు.  ఇక ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే వివాహ డేట్ ను ప్రకటిస్తూ అభిమానులకు సంతోషాన్ని కలిగించారు. కానీ ఉన్నట్టుండి తిరుపతిలో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా వారి హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయగా అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ జంట చాలా క్యూట్ గా ఉంది అంటూ నేటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: