నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో అదిరిపోయే పవర్ఫుల్ మాస్ హిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వీర సింహా రెడ్డి మూవీ సక్సెస్ తో ఈ సంవత్సరన్ని ప్రారంభించిన బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్.లో శ్రీ లీల కూడా జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది.

మూవీ లో బాలకృష్ణ మరియు శ్రీ లీల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉండనున్నట్లు ... శ్రీ లీల ను కిడ్నాప్ చేసే సన్నివేశంలో బాలకృష్ణ చేసే యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉండబోతున్నట్లు ... ఈ యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ ... శ్రీ లీల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా సూపర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: