రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై ఎప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.అయితే ప్రభాస్ పెళ్లి వార్తలకు మరింత ఆజ్యం పోసేలా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎప్పుడు ఆయన పెళ్లి అప్పుడు జరగబోతుంది ఇప్పుడు జరగబోతుంది అంటూ హింట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఆ మధ్యకాలంలో విజయవాడ దుర్గాదేవిని దర్శించిన శ్యామలాదేవి నా కొడుకు పెళ్లి ఈ ఏడాది జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చింది. కానీ సడన్గా ఈసారి దుర్గాదేవి ఆలయానికి వచ్చిన సమయంలో మాట మార్చేసింది. మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరు అందుకోలేని స్థాయికి ఎదిగారు.. 

అయితే అలాంటి ప్రభాస్ సినిమాల ద్వారా ఎంతో సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం వెనకబడ్డారు. ఎందుకంటే ఈయన 40 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. అందులో శ్యామలాదేవి చెప్పే మాటలు ఆయన పెళ్లి ఇప్పుడే జరగబోతుంది అనేలా  ఉంటాయి.కానీ ఇప్పటివరకు అయితే ఆయన పెళ్లి జరగలేదు. అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంది. అక్కడికి శ్యామలా దేవి రావడంతోనే అక్కడే ఉన్న మీడియా వాళ్ళు ఆమెను ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించారు. దాంతో సడన్గా మాట మార్చేసింది శ్యామలాదేవి.

 ఇన్ని రోజులు శ్యామలా దేవి ఎక్కడైనా కనిపిస్తే ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవగానే నా కొడుకు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పేది. కానీ ఈసారి మాత్రం మాట మార్చి ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా ఆ దుర్గమ్మను కూడా ప్రభాస్ పెళ్లి తొందరగా జరిగేలా చేయమని మొక్కుకున్నట్లు శ్యామలా దేవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్యామలా దేవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో ఇక ప్రభాస్ పెళ్లి ఈ రెండు మూడేళ్లలో జరిగేలా లేదు.50 ఏళ్లు వచ్చాక చేసుకుంటాడు కావచ్చు అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: