టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కుటుంబం నుండి వచ్చిన యంగ్ స్టార్ హీరోస్ లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఆయన గతేడాది బింబిసార సినిమాతో సక్సెస్ సాధించగా ఆ మూవీ సక్సెస్ ఇచ్చిన ఆనందం అమిగోస్ మూవీతో ఆవిరైంది. కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీలో మూడు పాత్రలలో నటించగా ఆ మూడు పాత్రలు బాగానే ఉన్నా ప్రేక్షకులను మాత్రం కళ్యాణ్ రామ్ మెప్పించలేకపోయారు.

అయితే తాజాగా ఒక సందర్భంలో కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

సీనియర్ ఎన్టీఆర్ తో తనను పోల్చవద్దని తాను అంత పెద్దవాన్ని కాదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ స్థాయిని నేను చేరుకోలేనని కళ్యాణ్ రామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం నిన్న జరగగా చెన్నై రాయపేటలోని మ్యూజిక్ అకాడమీ ఇందుకు వేదికైంది. ఈ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ చెప్పిన విషయాలు ఆకట్టుకుంటున్నాయి.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో అభిషేక్ నామా నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుండగా కళ్యాణ్ రామ్ మార్కెట్ ను మరింత పెంచేలా ఈ సినిమా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సైతం ఎన్టీఆర్ తో కలిసి నటించే ఆలోచన అయితే ఉందని అయితే చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా ఈ సినిమాలు కమర్షియల్ గా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాయో చూడాలి. కళ్యాణ్ రామ్ రేంజ్ మరింత పెరగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: