టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ యాక్షన్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా హిప్ హాప్ తమీజ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.  తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదల సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ అయినటువంటి "ఏందే ఏందే" అనే సాంగ్ ను ఈ రోజు రాత్రి 7 గంటల 02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

అలాగే ఏజెంట్ మూవీ యూనిట్ ఈ పాటకు చంద్రబోస్ లిరిసిస్ట్ గా వివరించినట్లు ... ఈ పాటకు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ను అందించినట్టు ... సంజిత్ హెగ్డే ... పద్మలత ఈ సాంగ్ ను పాడినట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలియజేసింది. మరి ఏజెంట్ మూవీ నుండి విడుదలకు రెడీగా ఉన్న "ఏందే ఏందే" సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేసి ఈ మూవీ పై ఉన్న అంచనాలను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అఖిల్ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ ల స్పీడ్ ను మరింతగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: